తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో వేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఈటల దగ్గర ఉన్న వైద్య ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు గవర్నర్ తమిళిసై… దీంతో.. ఏ శాఖలేని మంత్రిగా ఈటల మిగిలిపోయారు.. అయితే, ఈటల నుంచి వైద్య, ఆరోగ్యశాఖ తప్పించాలని గవర్నర్‌కు సీఎం కేసీఆర్ లేఖ రావడంతో.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు గవర్నర్.. ఇక, ఈటలపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో.. విచారణకు ఆదేశించిన సంగతి…