మేడ్చల్ ఐటీఐ కళాశాల తరలింపుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. అయితే తమ ఐటీఐ కళాశాల తరలించకుండా చర్యలు తీసుకోవాలని సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మకు 132 విద్యార్థుల లేఖ రాసారు. తమ కళాశాలని తరలించి భూమిని కంపెనీలకు కేటాయించేందుకు కసరత్తు జరుగుతోందని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ విద్యార్థుల లేఖను సుమోటో పిల్ గా స్వీకరించింది సీజే ధర్మాసనం. ఆ ఐటీఐ కళాశాల తరలిస్తే పేద, మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బంది పడతారని తెలిపింది హైకోర్టు.…