Hens Death : భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలం అవుతోంది. ఎక్కడ చూసినా వరద నీళ్లే కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. పట్టణాల్లో కాలనీలు చెరువుల్లాగా కనిపిస్తున్నాయి. నిజాంపేట (మం) నందిగామ గ్రామం నీట మునిగింది. ఈ గ్రామంలోని పౌల్ట్రీ ఫాంలోకి భారీగా వరద నీరు చేరింది. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ఫాంలోని సుమారు 10 వేల కోళ్లు నీటిలో మునిగి చనిపోయాయి. సుమారు 14 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు పౌల్ట్రీ ఫారం యజమాని…