ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నోటి నుంచి త్వరలో మరో శుభవార్త వింటామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రజలను ఉద్దేశించి అన్నారు. మే 1న మేడే సందర్భంగా కార్మికులకు శుభవార్త ప్రకటిస్తామన్నారు.
కార్మిక దినోత్సవం మే డే వేడుకలు ఏపీలో ఘనంగా నిర్వహిస్తున్నారు, వామపక్షాల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో మేడే వేడుకల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాక కార్మికుల హక్కులను కాలరాస్తుంది. పోరాడి సాధించుకున్న 44 చట్టాలను ఒక్క కలం పోటుతో కేంద్రం రద్దు చేసింది. హక్కుల కోసం ఉద్యమిస్తే, పోరాడితే, ప్రశ్నిస్తే, అక్రమంగా కేసులు పెడుతున్నారు. కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా నిబంధనలన్నీ వారి గుప్పెట్లో పెట్టారు. ప్రభుత్వ సంపదలను…
కార్మికులకు, కర్షకులకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు ట్వీట్ చేశారు. శ్రామిక, కార్మిక సోదరులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. పరిశ్రమలే రాష్ట్ర ప్రగతికి మెట్లు. టీడీపీ హయాంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన తో లక్షల మంది ఉపాధి పొందారు. నాటి టీడీపీ పాలనలో పారిశ్రామిక రంగం కళకళలాడుతూ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు పవర్ హాలిడేలతో…
* ఇవాళ ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే. దేశవ్యాప్తంగా వేడుకల్లో పాల్గొననున్న కార్మికులు. * నేడు జి.కొత్తపల్లిలో గంజి ప్రసాద్ అంత్యక్రియలు. ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించడానికి గ్రామానికి రానున్న హోం మంత్రి వనిత, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని *పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి రోజా పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి రోజా. మార్టేరులో జరుగుతున్న బాస్కెట్ బాల్ ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి రోజా *తిరుపతిలో నేడు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో…