కార్మిక దినోత్సవం మే డే వేడుకలు ఏపీలో ఘనంగా నిర్వహిస్తున్నారు, వామపక్షాల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో మేడే వేడుకల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాక కార్మికుల హక్కులను కాలరాస్తుంది. పోరాడి సాధించుకున్న 44 చట్టాలను ఒక్క కలం పోటుతో కేంద్రం రద్దు చేసింది.
హక్కుల కోసం ఉద్యమిస్తే, పోరాడితే, ప్రశ్నిస్తే, అక్రమంగా కేసులు పెడుతున్నారు. కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా నిబంధనలన్నీ వారి గుప్పెట్లో పెట్టారు. ప్రభుత్వ సంపదలను అంబానీ, అదానీలకు దోచి పెడుతున్నారు. మోడీ చెప్పినట్లుగా జగన్ పాలన సాగిస్తూ.. కార్పోరేట్ సంస్థలకు కారు చౌకగా కట్టు బెడుతున్నారు. కార్మికుల హక్కులను సాధించుకునేందుకు మరోసారి కార్మికులంతా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
సీపీఎం సీనియర్ నాయకుడు మధు మాట్లాడుతూ.. సీపీయస్ రద్దు కోసం ప్రభుత్వం ఉద్యోగులతో సంప్రదింపులు జరపాలి. జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పోలీసులను అడ్డం పెట్టుకుని నిర్భంధించడం సబబు కాదు. ఏలూరులో వైసీపీలో వచ్చిన వర్గ పోరుతోనే హత్యలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే పైనే దాడి చేసే స్థాయికి ప్రజలు వచ్చారంటే.. అది ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహమే కారణం అన్నారు. రైతాంగానికి ధరలు లేవు, కౌలు రైతులకు రక్షణ లేదు. పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగిపోతుంటే.. వాటిపై మరిన్ని పన్నులు పెంచుతున్నారు. రాష్ట్రంలో దళితులు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారంపై చర్చించాలన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మేడే వేడుకల్లో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా కార్మికులు మేడే జరుపుకుంటున్నారు. కేంద్రం కార్పొరేటుకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున పోరాడాలి. సీపీఎస్ రద్దు అంటే జీపీఎస్ అంటూ మాట తప్పాడు, మడమ తిప్పాడు. ఈ రాష్ట్రంలో పోలీసులు ఉన్నారా.. వారానికి రెండు రేప్‌లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా ఉన్నారు. హోంమంత్రి నామ మాత్రమే. పోలీసు వ్యవస్ధను సీఎం జగన్, సజ్జల నడుపుతున్నారు. ప్రతిపక్షాలను అణచడానికే పోలీసులను వాడుతున్నారని విమర్శించారు.
రాజమండ్రి సి.పి.ఐ జాతీయ కార్యదర్శి నారాయణ మేడే విప్లవ అభినందనలు తెలిపారు. నిన్న ఢిల్లీలో ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ విలువైన సూచనలు చేశారన్నారు. న్యాయవ్యవస్థలో ముందుగా దేశ ద్రోహం చట్టం రద్దు చెయ్యాలి. బ్రిటీష్ కాలం నాటి దేశద్రోహం చట్టం ఇప్పుడెందుకు. కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్న కేసులు ప్రభుత్వం నుంచే ఎక్కువగా ఉన్నాయి. కోర్టు ధిక్కరణ చేస్తున్న ముఖ్యమంత్రుల్లో జగన్ నెంబర్ వన్. తెలంగాణ నుంచి ఛీప్ సెక్రటరీ కోర్టు ధిక్కరణాల్లో నెంబర్ వన్. మే డే సందర్బంగా రాజమండ్రి సీపీఐ కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు జాతీయ కార్యదర్శి నారాయణ. సీపీఐ కార్మికసంఘం ఆధ్వర్యంలో మేడే ర్యాలీలో పాల్గొన్నారు నారాయణ.
May Day: కార్మికుడి డ్రెస్ లో మంత్రి మల్లారెడ్డి