Gyanvapi: ఉత్తర్ ప్రదేశ్ బరేలీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇత్తేహాద్-ఈ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మౌలానా తౌకీర్ రజాఖాన్ జ్ఞానవాపి వివాదంలో ‘జైల్ భరో’కి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. జ్ఞానవాపి కేసులో కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆయన మద్దతుదారులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా, బారికెడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లారు.