Chhava: ఔరంగజేబు సమాధిని తొలగించాలనే వివాదం, నాగ్‌పూర్ ఘర్షణల నేపథ్యంలో ‘‘ఛావా’’ సినిమాని బ్యాన్ చేయాలని మతాధికారి డిమాండ్ చేశారు. బరేల్వీ మత గురువు మౌలానా షాబుద్దీన్ రజ్వీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మొఘల్ పాలకుడు ఔరంగజేబు పాత్రని రెచ్చగొట్టే విధంగా చిత్రీకరించాలని లేఖలో ఆరోపించారు. ఇది వల్ల మతపరమైన అశాంతిని రెచ్చగొట్టే విధంగా ఉందని ఆరోపిస్తూ ‘‘ఛావా’’ని నిషేధించాలని కోరారు. ఆల్ ఇండియా ముస్లిం జమ్మత్ దర్గా ఆలా హజ్రత్…