శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా పరిశ్రమలో ఏకంగా 900 కారు ఇంజిన్లు మాయం కావడం కలకలం రేపుతోంది.. కియా పరిశ్రమలో రోజుకి వందల కార్లు ఉత్పత్తి అవుతుంటాయి.. ఈ కియా కార్లు తయారు చేసే ప్రధాన పరిశ్రమకు విడిభాగాలు, పరికరాలు 25 కియా అనుబంధ పరిశ్రమల నుంచి వస్తాయి.. అయితే, దాదాపు 900 కియా కార్ల ఇంజిన్లు మాయమైనట్లు యాజమాన్యం గుర్తించింది..
జగిత్యాల జిల్లాలో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. మేడిపల్లి మండలం దమ్మన్నపేటలో భారీ చోరీకి పాల్పడ్డారు. పొలం పనులకు వెళ్లి తిరిగొచ్చేలోపే 14 తులాల బంగారు ఆభరణాలు మాయం అయ్యాయి. వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న మహిళకు ఊహించని షాక్ తగిలింది. తాళం వేసి ఉన్న ఇళ్లు చోరికి గురికావడంతో లబోదిబోమన్నది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏనుగు పద్మ అనే మహిళ ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దుండగులు…
అనంతపురం శివారులో రాజహంస విల్లాస్‌లో భారీ చోరీ జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శివారెడ్డి ఇంట్లో రూ. 3.5 కోట్ల విలువైన బంగారు నగలను దుండగులు అపహరించారు. కూతురు వివాహం కోసం దాచి వుంచిన నగలు, నగదు ఎత్తుకెళ్లారు. ఇంట్లో నుంచి దాదాపు రూ. 20 లక్షలు తీసుకు వెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఏలూరు నగరంలో శనివారం రాత్రి ఒక జ్యూవెలరీ షాపులో చోరీ జరిగింది. ఆ దుకాణంలో దొంగతనం తీరు వ్యాపారులనే కాదు స్థానికులను సైతం భయపడే విధంగా ఉంది. షాపుకు వెనుక వైపున పాడుబడిన భవనం ఉండడంతో ఇది గమనించిన దొంగలు గోడకి కన్నం వేసి ఉన్నదంతా దోచేశారు..
Sri Krishna Travels: శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో భారీ చోరి కలకలం రేపింది. మహిళా బ్యాగ్ లో రూ. 15లక్షల విలువ గల బంగారు ఆభరణాలను కొందరు దుండగులు అపహరించారు.