హైతీలో భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. శనివారం 7.2 తీవ్రతతో వచ్చిన ప్రకంపనల ధాటికి ఇప్పటి వరకు 304 మంది మృత్యువాతపడ్డారు. 2010లో సంఘటన నుంచి నుంచి కోలుకుంటున్న ఆ దేశంపై ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. తెల్లవారు జామున ఒక్కసారిగా వచ్చిన ప్రకంపనలతో జనం బయటకు పరుగులు పెట్టారు. అత్యంత జనసాంద్రత కలిగిన రాజధాని పోర్ట్-ఓ-ప్రిన్స్ నగరానికి 160 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైంది. భూకంపం తీవ్రతకు భవనాలు నేలమట్టమవగా.. పెద్ద ఎత్తున జనం మృత్యువాతపడగా..…