Iran Nuclear Program: టెహ్రాన్‌లోని అణుశక్తి సంస్థను ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సందర్శించారు. ఈ సందర్భంగా పెజెష్కియాన్ దేశ అణు శాస్త్రవేత్తలు, అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టెహ్రాన్ తన అణు సౌకర్యాలను పునర్నిర్మించుకుంటుందని, ఇంకా ఎక్కువ శక్తితో వాటిని తిరిగి నిర్మిస్తామని చెప్పారు. “ఎన్ని భవనాలు, కర్మాగారాలు ధ్వంసమైనా, మేము వాటిని పునర్నిర్మిస్తాము, ఈసారి మరింత బలంగా ఉంటాము” అని ఆయన వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమం ఆయుధాల కోసం కాదు,…
ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం చాలా ప్రమాదకరమైన దశకు చేరుకుంది. ఆదివారం ఉదయం, అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసింది. అమెరికా చర్య తర్వాత, ప్రపంచంలో కలకలం రేగింది. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రధాని మోదీ ఈ సమాచారాన్ని ఎక్స్ పోస్ట్ ద్వారా పంచుకున్నారు. ‘నేను ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో మాట్లాడాను. ప్రస్తుత పరిస్థితిపై వివరంగా చర్చించాము.…
PM Modi: ఇజ్రాయిల్-ఇరాన్ సంక్షోభం, హమాస్, హిజ్బుల్లాతో ఇజ్రాయిల్ యుద్ధాల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలో రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్‌లో ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజిష్కియాన్ ప్రధాని నరేంద్రమోడీతో ఈ రోజు భేటీ అయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం గురించి ఇరువురు నేతలు చర్చించారు.
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. సంస్కరణవాద అభ్యర్థి మసూద్ పెజెష్కియాన్ అధ్యక్ష ఎన్నికల్లో అతివాద అభ్యర్థి సయీద్ జలీలీని ఓడించి విజయం సాధించారు. దేశంలో 49.8 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి మొహసిన్ ఎస్లామీ తెలిపారు.