భారత్‌లో ఒమిక్రాన్ కలకలం. ఇండియాలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ నిర్థారించారు. ప్రపంచ దేశాల గుండెల్లో ఒమిక్రాన్ గుబులు పుట్టిస్తోంది. దాదాపు రెండేళ్లుగా వైరస్‌తో సతమతమవుతున్న ప్రజలు.. ఇప్పుడు మరో ఉపద్రవం ముంచుకొస్తుందన్న వార్తలతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. నిజంగా కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అంత ప్రమాదకరమా? 26 నవంబర్ 2021న, వైరస్ ఎవల్యూషన్‌పై డబ్ల్యూఎచ్ఓ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (TAG-VE) దక్షిణ ఆఫ్రికా లో ఒమిక్రాన్ B.1.1.529…
కరోనా మహమ్మారి కేసులు ఇంకా పూర్తి స్థాయిలో తగ్గిపోలేదు.. మళ్లీ పెరుగుతున్నాయి.. దానికి తోడు ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను భయపెడుతోంది.. తన దేశానికి కూడా ఒమిక్రాన్ ముప్పు తప్పేలా లేదని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.. మళ్లీ కఠిన ఆంక్షలకు పూనుకుంటుంది. తెలంగాణలో మాస్క్ తప్పనిసరి చేసింది.. మాస్కు లేకుంటే రూ. వెయ్యి జరిమానా విధించాలని నిర్ణయానికి వచ్చింది.. ఈ విషయాన్ని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.. Read…
కరోనా కాలంలో మాస్క్‌లు ధరించడం కామన్ అయింది. ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాము అంటే అన్నింటితో పాటు ముఖానికి మాస్క్ ధరించడం కామన్ అయింది. మాస్క్ వాడకం పెరగడంతో వినూత్నంగా కొత్త కొత్త మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. వెరైటీ డిజైన్‌తో ఆకట్టుకునే విధంగా మాస్క్‌లను తీర్చిదిద్దుతున్నారు. కరోనా తగ్గినా మాస్క్ కంపల్సరీ చేయడంతో మాస్క్ వాడకం పెరిగిపోయింది. ఇక ఇదిలా ఉంటే, కొంతమంది తమ దర్పాన్ని ప్రదర్శించేందుకు బంగారంతో మాస్కులు తయారు చేయించుకుంటున్నారు. Read: ఆ…
ఇప్పటి వరకు హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తే పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. బైక్ నడిపే వారితో పాటుగా వెనక కూర్చున్న వ్యక్తులు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. లేకపోతే జరిమానాలు విధిస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు నిఘాను పెంచి హెల్మెట్ ధరించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, నగరంలో చాలా మంది కోవిడ్ నిబంధనలు పాటించకుండా వాహానలు నడుపుతున్నారు. దీనిపై పోలీసులు దృష్టిసారించారు. హెల్మెట్‌తో పాటుగా మాస్క్ ధరించకుండా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధం…
ప్రపంచం నుంచి కరోనా ఇంకా దూరం కాలేదు. అమెరికా వంటి దేశాల్లో కరోనా ఉధృతంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజూ లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రెండు వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగంగా అమలు చేస్తుంటే కొన్ని చోట్ల వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. వ్యాక్సిన్ ను వ్యతిరేకిస్తున్నారు. కరోనా నుంచి బయట పడలేదు కాబట్టి తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని ప్రభుత్వం ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేస్తూ వస్తున్నది. …
కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇప్పటికీ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. వేగంగా కేసులు విస్తరిస్తుండటంతో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. మాస్క్ ధరించడం తప్పని సరి అని చెబుతున్నా, ప్రజలు ఆ మాటలు నెత్తికెక్కించుకోవడం లేదు. నాయకులే మాస్కులు పక్కన పెట్టి సభలు, సమావేశాలు, యాత్రలు చేస్తున్నారు. రాజు చూపిన బాటలోనే కదా ప్రజలు నడిచేది. అందుకే ప్రజలు కూడా అలానే చేస్తున్నారు. అయితే, మనుషుల కంటే తానే బెటర్ అని చెప్పకనే చెప్పింది…
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కాస్త తెరిపించినా దేశంలో ప్రతిరోజూ 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంతో పాటుగా అన్ని రంగాలు తిరిగి ప్రారంభం కావడంతో మాస్క్‌ను పక్కన పెట్టి మామూలుగా తిరిగేస్తున్నారు. ఇలా చేయడం వలన కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, వేగంగా వ్యాక్సిన్ అమలు చేస్తున్నా తప్పని సరిగా మాస్క్ పెట్టుకోవాలని, లేదంటే వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడాల్సి వస్తుందని…
మాస్క్ లేకుండా బయటకు వస్తే భారీ జరిమానాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, మాస్క్ పెట్టుకున్నప్పటికీ ఓ వ్యక్తికి జరిమానా విధించడంతో పాటుగా జైల్లో పెట్టారు. అదేంటి మాస్క్ ధరిస్తే జరిమానా వేయడం ఏంటి అనుకుంటున్నారా… అక్కడే ఉంది ట్విస్ట్. మామూలు మాస్క్ ధరిస్తే ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ, ఆ వ్యక్తి భయపెట్టే విధంగా కాస్ట్యూమ్ మాస్క్ ధరించాడు. భయపెట్టే విధంగా ఉన్న మాస్క్ ధరించి దారినపోయే వారిని భయపెడుతుండటంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని…
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ సమయంలో కూడా కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ టోక్యో ఒలింపిక్స్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది ఐవోసీ. అయితే కొవిడ్ నిబంధనలో భాగంగా అథ్లెట్లు కచ్చితంగా మాస్కులు ధరించాల్సి వస్తోంది. ఈ క్రమంలో పతకాలు అందుకుంటున్న సమయంలోనూ మాస్క్ ధరిస్తుండటంతో విజేతల ముఖాల్లో ఆనందాన్ని కెమెరాలు బంధించలేకపోతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన ఐవోసీ.. నిబంధనలో చిన్న సవరణ చేసింది. క్రీడాకారులు 30 సెకన్లు మాస్క్ తీయడానికి…
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండటంతో పర్యాటక రంగం ఊపందుకుంది. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులు పోటెత్తున్నారు. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గినా, ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా, విధిగా మాస్కులు ధరించాలని, ముఖ్యంగా ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడే ప్రాంతాల్లో మాస్క్ తీయకూడదని ప్రభుత్వాలు మోరపెట్టుకుంటున్నాయి. అయినా, ప్రజలు షరామామూలుగా మారిపోయారు. మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. తిరిగి అదే నిర్లక్ష్యం ప్రజల్లో కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు నిత్యం టూరిస్టులు పెద్ద ఎత్తున వస్తుంటారు. కరోనా…