కరోనా మహమ్మారి కేసులు ఇంకా పూర్తి స్థాయిలో తగ్గిపోలేదు.. మళ్లీ పెరుగుతున్నాయి.. దానికి తోడు ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను భయపెడుతోంది.. తన దేశానికి కూడా ఒమిక్రాన్ ముప్పు తప్పేలా లేదని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.. మళ్లీ కఠిన ఆంక్షలకు పూనుకుంటుంది. తెలంగాణలో మాస్క్ తప్పనిసరి చేసింది.. మాస్కు లేకుంటే రూ. వెయ్యి జరిమానా విధించాలని నిర్ణయానికి వచ్చింది.. ఈ విషయాన్ని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు..
Read Also: రేపో మాపో మన దేశానికీ ఒమిక్రాన్..! తెలంగాణ హెల్త్ డైరెక్టర్ వార్నింగ్..
మరోవైపు.. వ్యాక్సిన్లు ప్రాణాలను రక్షిస్తాయి.. ప్రజల చెంతకు వ్యాక్సిన్లు వస్తున్నాయి… సద్వినియోగం చేసుకోవాలని సూచించారు శ్రీనివాసరావు.. 5.90 లక్షల మంది హైదరాబాద్ లో, 4.80 లక్షల మంది మేడ్చల్ లో, 4.10 లక్షల మంది రంగారెడ్డిలో రెండో డోస్ వేసుకోవాల్సి ఉందన్నారు.. తెలంగాణ వ్యాప్తంగా 25 లక్షల మంది రెండో డోస్ తీసుకోవాల్సి ఉందని.. వీరంతా వెంటనే వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. వ్యాక్సిన్ వేసుకోకపోతే ఆత్మహత్య చేసుకున్నట్టే నంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. సౌత్ ఆఫ్రికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగకపోవడంతోనే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారని గుర్తుశారు.. ఇక, వ్యాక్సిన్ కంటే అత్యంత రక్షణ కవచం మాస్క్… మాస్క్ ఖచ్చితంగా ధరించాలని సూచించిన ఆయన.. మాస్క్ ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా వేయాలని పోలీసులకు సూచించాం.. బహిరంగ ప్రదేశాలు, ఆఫీసుల్లో కూడా మాస్క్ లు ఖచ్చితంగా ధరించాలన్నారు.. వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే.. వ్యాక్సిన్ పై ఖచ్చితమైన నిబంధనలు ప్రభుత్వ అనుమతితో రూపొందించబోతున్నాం అన్నారు డీహెచ్ శ్రీనివాసరావు.