దేశంలో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. రోజురోజుకూ కోవిడ్ కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల్లో సినీ సెలెబ్రిటీలు తమవంతు ప్రయత్నంగా ప్రజల్లో కరోనా జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మహేష్ బాబు ముందున్నారు. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్ పోలీసులకు తన సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే ‘కోవిడ్‌తో పోరాడుతున్న వారికి సహాయపడటానికి మనం చేయగలిగిన ప్రతిదీ చేద్దాం. ప్లాస్మా దాతలు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ అవసరం.…