Marriage: సోనమ్ రఘువంశీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భర్త రాజా రఘువంశీని హనీమూన్ పేరుతో మేఘాలయా తీసుకెళ్లి, కిరాయి హంతకులతో హత్య చేయించింది. తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ప్లాన్ చేసి ఘాతుకానికి తెగబడింది. అయితే, ఒక్క సోనమ్ ఘటనే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని సంఘటనలతో యువకులు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకువచ్చింది.
ప్రేమ, పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. ఇదే రీతిలో ఓ వైద్యుడు లేడీ డాక్టర్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచించాడు. తన కోరిక తీర్చుకున్నాక వివాహానికి నిరాకరించాడు. మోసపోయానని గ్రహించిన మహిళా వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లేడీ డాక్టర్ హైదరాబాద్ లోని నిలోఫర్ హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తోంది. మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ స్వామి పనిచేస్తున్నాడు. Also Read:Heavy Rain Forecast:…
తల్లిదండ్రులు తమ పిల్లలు ఎదిగాక వారికి పెళ్లిళ్లు చేసి ఓ ఇంటి వాళ్లను చేయాలని భావిస్తుంటారు. తమ బాధ్యతగా కొడుకులు, కూతుర్లకు వివాహాలు జరిపిస్తుంటారు. ఇదే విధంగా ఓ తండ్రి తన కుమారుడి పెళ్లిని ఘనంగా చేయాలనుకున్నాడు. తగిన వధువును చూసి పెళ్లి జరిపించాలని కలలు కన్నాడు. కానీ, అతని కల కలగానే మిగిలిపోయింది. మరో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా వధువు ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో కుమారుడి పెళ్లి ఆగిపోయింది. అవమాన భారంగా భావించిన…
మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన నవ వధువుకు పెళ్లయిన మూడు నెలలకే నూరేళ్లు నిండాయి. పెళ్లయిన మూడునెలలకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. పూజ(24) నిన్న రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిన్నశంకరంపేట (మం) అగ్రహారంలో చోటుచేసుకుంది. తమ కూతురు మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. భర్త మహేష్, అత్తమామలే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. Also…
పెళ్లంటే సందడి.. హడావుడి.. బంధువులు.. అతిథుల రాకతో ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆటపాటలు.. డ్యాన్స్‌లు, డీజేలు.. ఇలా ఒక్కటేంటి? రకరకాలైన కార్యక్రమాలు ఉంటాయి. ఇక పెళ్లి అనగానే గుర్తుకొచ్చేది విందు భోజనం.
ఓ ప్రేమజంటకు అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది. తల్లిదండ్రుల్ని ఎదురించి వివాహం చేసుకున్న జంటకు రక్షణ కల్పించలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. పోలీస్ రక్షణను హక్కుగా డిమాండ్ చేయరాదని.. ఒకవేళ నిజమైన బెదిరింపు అయితే పోలీసులు రక్షణ కల్పిస్తారని అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అనే సామెతను ఈ మధ్య సెలబ్రెటిలు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు ఉన్నారు . ఒక్కొక్కరుగా కెరీర్ పీక్స్ లో ఉండగా పెళ్లి చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా నటి అభినయ కూడా వివాహ బందం లోకి అడుగుపెట్టింది. పుట్టుకతో మూగ, చెవుడు వంటి అంగ వైకల్యం ఉన్నప్పటికీ పట్టుదలతో నటిగా మారి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అభినయ. అయితే గత కొద్ది రోజులుగా ఈ అమ్మడి…
ప్రేమ పేరుతో ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి పేరుతో యువతితో శారీరక సంబంధం కూడా ఏర్పరచుకున్నాడు. తీరా ఆ అమ్మాయిని మోసం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. అయితే ఇంతలో ప్రియురాలు ఓ ట్విస్ట్ ఇచ్చింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది.
Judge: విడిపోయిన భార్యాభర్తల మధ్య మధ్యవర్తిత్వం చేస్తున్న సెషన్స్ కోర్ట్ జడ్జి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. జడ్జి సదరు మహిళను ఉద్దేశించి, ఆమెకు ‘‘బొట్టు’’, ‘‘మంగళసూత్రం’’ ధరించడం లేదని, మీ భర్తకు మీపై ఎందుకు ఆసక్తి చూపిస్తాడు..? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. పూణేకి చెందిన వివాదాలను వాదించే లాయర్ అంకుర్ ఆర్ జహంగీర్ దీని గురించి లింక్డ్ఇన్లో షేర్ చేశారు. గృహహింస కేసులో సదరు జంట న్యాయమూర్తి ముందు హాజరయ్యారని జహంగీర్ తెలిపారు. వివాదాన్ని…