వామ్మో.. రోజురోజుకు మహిళల అకృత్యాలు పెచ్చుమీరిపోతున్నాయి. మొన్నటికి మొన్న హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లి అత్యంత దారుణంగా సోనమ్ రఘువంశీ అనే నవ వధువు చంపేసింది. ఈ దుర్ఘటనను దేశ ప్రజలంతా ఇంకా మరిచిపోలేదు. తాజాగా బీహార్‌లో అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. మామ కోసం మూడు ముళ్లు వేసిన భర్తను 45 రోజులకే కొత్త పెళ్లికూతురు కాటికి పంపేసింది. ఈ దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అంతేకాకుండా పెళ్లంటేనే మగ వాళ్లు హడలెత్తిపోతున్నారు.
ఇది కూడా చదవండి: Nayanthara : పెళ్లి ఓ పొరపాటు.. విడాకులకు హింట్ ఇస్తూ నయనతార షాకింగ్ పోస్ట్
బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన ప్రియాంశు(25), గుంజా దేవి(20)కి వివాహం జరిగింది. అయితే ఆమెకు అప్పటికే మామ జీవన్ సింగ్(భర్త తండ్రి కాదు)తో శారీరిక సంబంధం ఉంది. అతడితో పీకల్లోతు ప్రేమలో ఉంది. జీవన్ సింగ్(55)నే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతో తెగేసి చెప్పింది. అందుకు వారు అంగీకరించలేదు. 2 నెలల క్రితం నబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్వాన్ గ్రామానికి చెందిన ప్రియాంశుతో దేవికి బలవంతంగా వివాహం జరిపించారు. కానీ మామ జీవన్ సింగ్‌ను మరిచిపోలేక ప్రియాంశుతో దూరంగా ఉంటుంది. ఇక నిత్యం జీవన్ సింగ్‌తోనే ఫోన్‌లో సంభాషిస్తోంది. ఈ క్రమంలోనే భర్తను చంపేయాలని కుట్ర పన్నింది.
ఇది కూడా చదవండి: Pune: పూణెలో దారుణం.. యువతిపై డెలివరీ బాయ్ అత్యాచారం.. సెల్ఫీ తీసుకుని ఏం రాశాడంటే..!
అయితే ప్రియాంశు.. తన సోదరిని సందర్శించి రైల్లో తిరిగి నవీ నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. తనను తీసుకెళ్లేందుకు బైక్ పంపించాలని దేవిని కోరాడు. దేవి పంపించిన మనుషులు.. బైక్‌పై తీసుకొస్తుండగా మార్గమధ్యలో తుపాకీ తీసుకుని ప్రియాంశును కాల్చి చంపేశారు. ఇక కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. దేవి గ్రామం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. ఇంతలో ప్రియాంశు కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆమె ఫోన్ డేటాను పరిశీలించగా బాగోతం బయటపడింది. మామ జీవన్ సింగ్‌తో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. పెళ్లైన దగ్గర నుంచి నిత్యం జీవన్ సింగ్‌తోనే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో దేవితో పాటు ఇద్దరు హంతకులను అరెస్ట్ చేశారు. జీవన్ సింగ్ కోసం గాలిస్తున్నారు.
హత్య కేసును దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పెళ్లైన 45 రోజులకే భర్తను చంపేసిందని పేర్కొన్నారు. మామతో శారీరిక సంబంధం ఉండడంతోనే భర్తను వదులించుకునేందుకు కుట్ర పన్నినట్లు చెప్పారు. దేవితో సహా ముగ్గురిని అరెస్ట్ చేశామని.. జీవన్ సింగ్ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.