Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి పెళ్లి ఆగిపోయిందని దారుణానికి పాల్పడ్డాడు. తాను పెళ్లి చేసుకోవాలని అనుకున్న అమ్మాయి అమ్మని, సోదరుడిని కాల్చి చంపినట్లు శనివారం పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్రంలోని ఇజ్జత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నిందితుడిని అసిహాబాద్‌కి చెందిన సంజీవ్ కుమార్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా..పోలీసులు వెతుకుతున్నట్లు తెలిపారు.
Marriage Cancellation: ఇటీవల కాలంలో పెళ్లి పందిరిలోనే పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. అబ్బాయిలు, అమ్మాయిల ప్రవర్తన ఇందుకు కారణం అవుతోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఓ పెళ్లి వేడుకలో వరుడికి షాక్ ఇచ్చింది పెళ్లికూతురు. వివాహ సమయానికి తాగి వచ్చిన వరుడితో పెళ్లికి నో చెప్పింది.