Madvi Hidma: మోస్ట్ వాంటెండ్ మావోయిస్ట్ మడావి హిడ్మా హతమయ్యాడు. నవంబర్ 30లోపు హిడ్మాను హతమారుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతంతో శపథం చేశారు. గడువుకు 12 రోజుల ముందే హిడ్మా ఎన్‌కౌంటర్ లో హతమయ్యాడు. మంగళవారం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ట్రై-జంక్షన్‌లోని దట్టమైన పుల్లగండి అడవులలో జరిగిన భీకర ఎన్‌కౌంటర్లలో హిడ్మాను భద్రతా దళాలు హతమార్చాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం నక్సలైట్లు ముగ్గురు గ్రామస్థులను చంపేశారు. బాధితులను తాళ్లతో గొంతు కోసి దారుణంగా చంపారు. ఈ దాడి స్థానికుల్లో భయాన్ని వ్యాప్తి చేయడానికి నక్సలైట్లు చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వామపక్ష తీవ్రవాదానికి కేంద్రంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడంలో భద్రతా దళాలు గణనీయమైన విజయాలు సాధిస్తున్నాయి. ఈ తరుణంలో ఇలాంటి దాడి జరగడం గమనార్హం .