మాన్సాస్ ట్రస్టుకూ, సింహాచలం దేవస్థానానికి చైర్మన్‌గా టిడిపి మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు స్థానంలో ఆయన అన్న కుమార్తె సంచైతను నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం గత ఏడాది ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. అశోక్ గజపతిని మళ్లీ నియమించాలని ఆదేశించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు ఉత్తర్వులు తమకింకా అందలేదని దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెబుతున్నారు. మరోవైపున తెలుగుదేశం నాయకులు ఇది ప్రజాస్వామ్య విజయమనీ, ప్రభుత్వానికి చెంపపెట్టు అని…