జోర్డాన్‌లోని ఒక రెస్టారెంట్‌లో తిన్న తర్వాత హాయిగా నిద్రపోవడానికి సౌకర్యాన్ని కల్పిస్తూ చక్కగా ఏసీ గదులను ఏర్పాటు చేశారు. ఆ హోటల్లో అక్కడి ఫేమస్ డిష్ తిన్నవారు కచ్చితంగా పడుకుని తీరాలని ఆ రెస్టారెంట్ యాజమాన్యం చెబుతోంది. అయితే, కడుపునిండా తిన్నాక ఎవ్వరికైనా కాసేపు పడుకోవడం కామన్. తిన్న తర్వాత కొద్దిసేపు కునుకు తీస్తే మనసుకి, శరీరానికి చాలా రిలీఫ్ దొరుకుతుంది.