ఎందరో దర్శకులకు అభిమాన దర్శకునిగా నిలిచారు మణిరత్నం. ఆయన తెరకెక్కించిన ‘నాయకన్’ చిత్రం ‘టైమ్’ టాప్ హండ్రెడ్ లో చోటు సంపాదించింది. ఇక ఆయన టేకింగ్ స్టైల్ కు ఎంతోమంది సినీజనం ఫిదా అయిపోయారు. మణిరత్నం చిత్రాల జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఈ నాటికీ ఎంతోమంది ఆయన సినిమాలను చూస్తున్నారు. అంతటి ఘనత వహించిన మణిరత్నం, గత సంవత్సరం తన ‘పొన్నియిన్ సెల్వన్-1’ విడుదల సమయంలో తమకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో రాజమౌళి డోర్స్ తెరిచారని వ్యాఖ్యానించారు.…