జాతి హింసతో అట్టుడికిపోతున్న ఈశాన్య రాష్టమైన మణిపూర్‌లో అకృత్యాలు ఆగడం లేదు. అక్కడి మహిళలపై జరుగుతున్న ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశాన్ని కుదుపేసిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌లోని ఉభయసభల్లోనూ నిరసన జ్వాలలు చల్లారకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.