Tiger attack: పెద్ద పులిని చూస్తేనే సగం ప్రాణాలు పోతాయి. ఇక అది దాడి చేస్తే తప్పించుకోవడం అంత సులభం కాదు. కానీ ఉత్తరాఖండ్‌కి చెందిన 17 ఏళ్ల బాలుడు మాత్రం పెద్దపులితో వీరోచితంగా పోరాడి ప్రాణాలు దక్కించుకున్నాడు. పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో రామ్‌నగర్ పట్టణానికి చెందిన అంకిత్ పులిదాడికి గురయ్యాడు. ప్రాణాంతక దాడి తర్వాత అనేక శస్త్రచికిత్సలు చేయించుకుని మళ్లీ సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ గత రెండు రోజుల కిందట అస్వస్థతకు గురయ్యారు. దీంతో మణిపాల్ హాస్పిటల్ డాక్టర్లు ఆయనకు అపెండెక్టమీ సైతం రోబో సాయంతో చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి గవర్నర్ అబ్దుల్ నజీర్ ను డాక్టర్లు డిశ్ఛార్జ్ చేశారు.
ఏపీ సీఎం జగన్ వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం ఉదయం విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దాదాపు 45 నిమిషాల పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కాగా సెప్టెంబర్ 24వ తేదీన సీఎం జగన్ వ్యాయామం చేస్తూ గాయపడ్డారు. జిమ్ చేస్తుండగా ఆయన కాలు బెనకడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆ సమయంలో వైద్యులు సాధారణ ట్రీట్‌మెంట్ ఇవ్వగా…
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో తమ్మినేని సీతారాంకు చికిత్స కొనసాగుతోంది. గత రెండు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా అనారోగ్యంగా ఉండటంతో ఇంట్లోనే వైద్యం తీసుకున్న ఆయన.. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఆస్పత్రిలో చేరారు. అయితే తమ్మినేని సీతారాం ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆళ్లనాని స్పందించారు. మణిపాల్ ఆస్పత్రికి ఫోన్ చేసి ఆయన…