త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మానిక్ సాహా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన త్రిపురకు 11 ముఖ్యమంత్రి. శనివారం అనూహ్యంగా సీఎంగా ఉన్న బిప్లవ్ కుమార్ దేబ్ రాజీనామా చేయడంతో… బీజేపీ శాసన సభ పక్షంగా కొత్త సీఎంగా మానిక్ సాహాను ఎన్నుకున్నారు. ఆదివారం రాజధాని అగర్తలతో గవర్నర్ సత్యదేవ్ నరేన్ ఆర్య, మానిక్ సాహాతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యసభ సభ్యుడైన సాహాను అనూహ్యంగా సీఎం పదవి వరించింది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు…