కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ అధ్యక్షతన టీ.కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఈ సీనియర్ల సమావేశంలో వాడి వేడిగా జరిగినట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకులకు టాగూర్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. టైం సెన్స్ లేకుంటే పద్దతి కాదని, 11 గంటలకు మీటింగ్ అంటే… పనెండున్నర కి రావడం ఏంటి..? మాణిక్కం ఠాగూర్ ప్రశ్నించారు. మీకు సమయం విలువ తెలియకపోవచ్చు…మాకు టైం ఇంపార్టెంట్ తెలుసన్న ఠాగూర్.. వరుసగా మూడు సమావేశాలకు రాకుంటే… నోటీసులు ఇస్తానని హెచ్చరించారు. అధిష్టానం అనుమతితో పదవుల నుండి తొలగిస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహం అంశాన్ని వి హనుమంతరావు లేవనేత్తారు. దీంతో రాహుల్ గాంధీ టూర్ పై చర్చ కానివ్వండి ఠాగూర్ వ్యాఖ్యానించారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై ఓ డెడ్ లైన్ పెట్టీ ఇష్యూ సెటిల్ చేయండని, అవసరం అయితే నేను కూడా వస్తానని జానారెడ్డి తెలిపారు. దీంతో పాటు డీసీసీ అధ్యక్షుల నియామకం పై కూడా చర్చ జరిగింది. మార్పులు చేర్పుల కోసం అనుమతి రాగానే.. త్వరలోనే డీసీసీల నియామకం షురూ చేస్తామని మాణిక్కం ఠాగూర్ తెలిపారు.