ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న ‘బలమెవ్వడు’ సినిమా వైద్యరంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్. బి. మార్కండేయులు ‘బలమెవ్వడు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధృవన్ కటకం నియా త్రిపాఠితో పాటు సుహాసిని మణిరత్నం, బబ్లూ పృథ్వీరాజ్ మరియు నాసర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణి శర్మ సంగీతం. సత్య రాచకొండ దర్శకత్వం వహించారు. శ్రీజయ గోదావరిచిత్రాలయ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఆర్…
సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘రిపబ్లిక్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1న థియేటర్లోకి రానుంది. దేవకట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రజాస్వామ్య వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపించే ప్రయత్నాలు చేశాయి. ఇక ‘గానా ఆఫ్ రిపబ్లిక్’ లిరికల్ వీడియో కూడా ఆకట్టుకోగా.. తాజాగా ‘జోర్ సే..’ అనే సెకండ్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. మణిశర్మ సంగీతం సమకూర్చగా.. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ…
యంగ్ డైరెక్టర్ సంపత్ నంది స్పోర్ట్స్ డ్రామా సీటిమార్ థియేటర్లలో సెప్టెంబర్ 10 న విడుదల కానుంది. ఈ చిత్రంలో గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్‌ల పాత్రలను పోషించారు. ఆగష్టు 31 మంగళవారం ఉస్తాద్ రామ్ పోతినేని ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఇందులో ఉన్న మసాలా, ఎంటర్‌టైనర్ వంటి అన్ని అంశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విడుదలైన 24 గంటల్లోనే ఈ సినిమా ట్రైలర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ రావడం విశేషం. పవర్-ప్యాక్డ్ “సీటిమార్”…
హీరో గోపీచంద్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ‘సీటీమార్’.. గోపీచంద్ కు జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. భూమిక చావ్లా, దిగంగన సూర్యవంశీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 10న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానుంది. ఈ నేపథ్యంలో ‘సీటీమార్’ ట్రైలర్ విడుదల చేశారు. గోపీచంద్ ఆంధ్ర కోచ్ గా, తమన్నా తెలంగాణ కోచ్…
నటుడు గోపీచంద్ హిట్ కొట్టి చాలా కాలమే అయింది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సీటీమార్ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. గోపీచంద్ సరసన తమన్నా నటిస్తోంది. స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ఆంధ్ర కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా నటించారు. సంపత్ నంది దర్శకత్వంలో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 3న విడుదల అవుతున్న సందర్బంగా సినిమాని ప్రేక్షకులకు చేరువ చేసేందుకు…
యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన “శ్రీదేవి సోడా సెంటర్” ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రైలర్ ను విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా సక్సెస్ కావాలని కోరారు. ట్రైలర్ చూస్తుంటే ఇది రివేంజ్ డ్రామాలా కన్పిస్తోంది. ఇంతవరకూ టీజర్, పోస్టర్లతో సినిమాను సాఫ్ట్ కార్నర్ లో చూపించిన మేకర్స్ ట్రైలర్ లో మాత్రం డిఫరెంట్ గా మాస్ తో యాక్షన్ ను కూడా చూపించారు.…
హీరో సుధీర్ బాబు, హీరోయిన్ ఆనంది జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. పలాస 1978 దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాను రూపొందించారు. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. కాగా, ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు అనూహ్య స్పందన వచ్చింది. ఆగస్టు 27న ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో మరింత జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుపుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మరో…
పలాస ఫేం కరుణ కుమార్ దర్శకత్వంలో విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. ఇందులో సుధీర్ బాబు ఇంతకుముందెన్నడూ లేని విధంగా డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో సుధీర్ లైటింగ్ సూరిబాబు పాత్ర చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, ఇటీవల విడుదల చేసిన ‘మందులోడా’ సాంగ్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా ‘నాలో ఇన్నాళ్లుగా’ అనే సాంగ్ లిరికల్…
టాలీవుడ్ లో ఎం. ఎం. కీరవాణి, మణిశర్మ ఇద్దరూ దిగ్గజ సంగీత దర్శకులు. వీళ్లు కలిసి ఓ పాటకు పనిచేస్తే ఆ పాట ఎంతో ప్రత్యేకమైనదై ఉండాలి. మణిశర్మ స్వరాలు సమకూర్చిన ఎన్టీఆర్ సినిమా ‘సుబ్బు’లో కీరవాణి పాట పాడారు. ఆ పాట తర్వాత 20 ఏళ్లకు ‘బలమెవ్వడు’ చిత్రంలో మణిశర్మ స్వరకల్పనలో కీరవాణి పాట పాడటం విశేషం. ‘బలమెవ్వడు కరి బ్రోవను…’ అని సాగే పాటను కీరవాణి అద్భుతంగా ఆలపించారు. ‘బలమెవ్వడు’ సినిమా క్లైమాక్స్ ఫైట్…