ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న ‘బలమెవ్వడు’ సినిమా వైద్యరంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్. బి. మార్కండేయులు ‘బలమెవ్వడు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధృవన్ కటకం నియా త్రిపాఠితో పాటు సుహాసిని మణిరత్నం, బబ్లూ పృథ్వీరాజ్ మరియు నాసర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణి శర్మ సంగీతం. సత్య రాచకొండ దర్శకత్వం వహించారు. శ్రీజయ గోదావరిచిత్రాలయ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఆర్ సత్య ప్రసాద్ నిర్మించారు.
Read Also : ఉత్తమ నటుడిగా మహేష్ బాబు
ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ కాన్సెప్ట్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సుహాసిని వైద్య రంగానికి చెందిన మాఫియాను ప్రశ్నించే డాక్టర్ పాత్ర పోషించడం విశేషం. ఈ రోజు “బలమెవ్వడు” సినిమా టీజర్ వచ్చింది. టీజర్ చూస్తుంటే సినిమా మొత్తం కామెడీ తో నిండినట్లు అనిపిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు హీరో క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకోవడం, మిగిలిన కథ అతను సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు అనే దాని చుట్టూ తిరుగుతుంది? మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.