కల్కి కృష్ణమూర్తి రాసిన ఐదు భాగాల చారిత్రక నవల ‘పొన్నియిన్ సెల్వన్’ను వెండితెరపై ఆవిష్కరించాలని చాలామంది దర్శకులు ఎంతో కాలంగా కలలు కంటున్నారు. అయితే.. దాన్ని సాకారం చేసుకుంటోంది మాత్రం ప్రముఖ దర్శకుడు మణిరత్నమే. ప్రముఖ నటీనటులు విక్రమ్, ‘జయం’ రవి, కార్తి, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, లాల్, జయరామ్, ప్రకాశ్ రాజ్, రియాజ్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా తొలిభాగానికి సంబంధించిన నయా పోస్టర్ ను సోమవారం విడుదల…
తమిళ స్టార్ దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం ‘నవరస’ వెబ్ సిరీస్ పై ఎక్కువగా దృష్టి పెట్టారు. మనిషిలోని తొమ్మిది భావోద్వేగాలను.. తొమ్మిది భాగాలుగా.. తొమ్మిది మంది దర్శకులతో ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘నవరస’ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఆగస్టు 6వ తేదీన ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. కాగా నవసర ప్రమోషన్స్ లో భాగంగా మణిరత్నం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే చాలా విషయాలు ముచ్చటించిన ఆయన..…
మణిరత్నం నిర్మాణంలో తెరకెక్కిన నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘నవరస’. పేరుకి తగ్గట్టుగానే తొమ్మిది రసాలు, భావోద్వేగాలతో కూడిన తొమ్మిది కథలు ఉంటాయంటున్నారు. ‘నవ’ అంటే తొమ్మిదే కాదు… ‘నవ’ అంటే ‘కొత్త’ అని కూడా కదా… ‘నవరస’ యాంథాలజీ సరికొత్తగా ఉంటుందట. శుక్రవారం ఈ వెరైటీ వెబ్ సిరీస్ ప్రోమో విడుదల కానుంది. ఇంకా అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. కానీ, ఆగస్ట్ తొమ్మిదిన నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ అవ్వొచ్చని టాక్ బలంగా…
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తొమ్మిది విభాగాలతో ‘నవరస’ వెబ్ సిరీస్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. శృంగారం, వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం వంటి తొమ్మిది విభాగాలకు తొమ్మిది మంది దర్శకులు పనిచేస్తున్నారు. ఆగస్ట్ 9వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘నవరస’ నుంచి దర్శకుడు గౌతమ్ మీనన్ చేస్తున్న ‘గిటార్ కంబి మేలే నిండ్రు’ అనే విభాగానికి సంబంధించిన ఫస్ట్ లుక్స్ ని…
దేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం తనకంటూ ఓ స్థానం సంపాదించారు. అంతర్జాతీయ వేదికలపై సైతం మణిరత్నం హవా విశేషంగా వీచింది. ఇంతకూ మణిరత్నంలో అంత గొప్పతనం ఏముందబ్బా? అంటూ ఎకసెక్కేలు చేసేవారు ఉన్నారు. ఎందుకంటే చాలా రోజులుగా మణిరత్నం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటలేకపోతున్నాయి. పైగా ఆయన నుండి వస్తున్న చిత్రాలలోనూ పాతకథలే కనిపించాయి. దాంతో ఈ తరం జనం మణి సినిమాలను అంతగా పట్టించుకోవడం లేదు. అందువల్ల నవతరం ప్రేక్షకులకు మణిరత్నం చిత్రాల్లోని…