ప్రముఖ దర్శకుడు మణిరత్నం పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది హృదయాలను తాకే అందమైన ప్రేమ కథలు. అయితే ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘థగ్‌లైఫ్’ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఫలితంగా కొంత నిరాశకు లోనైన మణిరత్నం, తన ఫేవరెట్ జోనర్ అయిన లవ్ డ్రామా వైపు మళ్లీ రీటర్న్ అవ్వడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఆయన కొత్తగా తెరకెక్కించబోయే చిత్రంలో తమిళ యువ హీరో ధ్రువ్ విక్రమ్, కన్నడ…