RK Roja: తోతాపురి మామిడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. 40,795 మంది రైతుల ఖాతాల్లో రూ.185.02 కోట్ల నగదు జమ చేసింది.. దీనిపై స్పందించిన మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్కే రోజా.. ఇది రైతుల విజయం.. వైసీపీ విజయంగా అభివర్ణించారు.. మామిడి రైతులకు న్యాయం చేయాలని మాజీ సీఎం జగన్, వైఎస్సార్సీపీ పోరాటం చేసింది.. మామిడి రైతులకు మద్దతుగా జగన్ బంగారుపాళ్యం వచ్చినప్పుడు తప్పించుకొని ధోరణిలో ప్రభుత్వం హామీ ఇచ్చింది.. ప్రభుత్వం తరపున రూ. 4, ఫ్యాక్టరీ తరపున రూ. 8 ఇస్తామని వాగ్దానం చేశారు.. నాలుగు, ఐదు నెలలుగా డబ్బులు ఇవ్వకుండా మోసం చేసింది ఈ ప్రభుత్వం అని దుయ్యబట్టారు..
Read Also: Mahabharath: క్యాన్సర్ తో మహాభారత్ నటుడి మృతి.. కర్ణుడి పాత్రలో…
మద్దతు ధర కోసం రైతులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం తరపున చేశాం.. ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన రూ. 4 లెక్కన నేడు డబ్బులు విడుదల చేసింది.. 40,795 మంది రైతులకు, 46,000 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడికాయలకు రూ. 185 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది అన్నారు.. అయితే, ఇది రైతుల విజయం, వైఎస్సార్సీపీ విజయంగా పేర్కొన్నారు.. అయితే, ఫ్యాక్టరీల నుంచి రావాల్సిన రూ. 370 కోట్లను కూడా ప్రభుత్వం ఇప్పించాలని డిమాండ్ చేశారు.. ప్రభుత్వం హామీ ఇవ్వడంతోనే రైతులు ధైర్యంగా ఫ్యాక్టరీలకు మామిడికాయలు తోలారు.. రూ. 370 కోట్లు రైతులకు చేరే వరకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా..