వేసవి సీజన్ వస్తోందంటే చాలు మామిడి పండ్ల కోసం ఎదురు చూసే వారెందరో. అందుకే మామిడి పండ్లను సమ్మర్ స్పెషల్ గా అభివర్ణిస్తారు. అంతేకాదు మామిడి పండ్లకే రారాజుగా కీర్తికెక్కింది. పిందె నుంచి పండు వరకూ మామిడి రుచే వేరు. బంగారు రంగులో, నోరూరించే తీపితో ఎండాకాలానికే ప్రత్యేకంగా నిలిచే పండు మామిడి. చిన్నా, పెద్దా తేడా లేకుండా మధుర ఫలం రుచి చూసేందుకు అందరూ ఆసక్తి చూపుతారు.