దేశ రాజధాని ఢిల్లీలో రెండు నెలల్లో వీధి కుక్కలు లేకుండా చేయాలని సోమవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ ప్రక్రియను ఎవరైనా అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఘాటుగా హెచ్చరించింది. తక్షణమే ఈ ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
సార్వత్రిక ఎన్నికల్లో కుమారుడు వరుణ్ గాంధీకి టికెట్ దక్కకపోవడంపై తొలిసారి తల్లి మేనకాగాంధీ స్పందించారు. వరుణ్‌పై తనకు విశ్వాసం ఉందని.. సమర్థవంతుడైన నాయకుడు అని కొనియాడారు.
Varun Gandhi: వరుణ్ గాంధీకి బీజేపీ షాక్ ఇచ్చింది. గత కొంత కాలంగా ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం నేపథ్యంలో.. తాజాగా ప్రకటించిన 5వ జాబితా అభ్యర్థుల్లో ఆయన పేరు లేదు. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ పిలిభిత్ నుంచి ఎంపీగా ఉన్న వరణ్ గాంధీ స్థానాన్ని కాంగ్రెస్ మాజీ నేత జితిన్ ప్రసాదకు కేటాయించింది.
ISKCON: ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్(ఇస్కాన్) బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి రూ. 100 కోట్ల పరువునష్టం నోటీసులు పంపింది. ఇటీవల ఆమె ఇస్కాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమపై పూర్తి నిరాధార ఆరోపణలు చేయడంతో భక్తులు తీవ్రమైన బాధను వ్యక్తం చేశారని ఇస్కాన్ పేర్కొంది. ఇస్కాన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా తాము న్యాయం కోసం ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టమని ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ అన్నారు.
Varun Gandhi: ఇందిరాగాంధీ మనుమడు, మేనకా- సంజయ్ గాంధీల వారసుడు వరుణ్ గాంధీ బీజేపీని వీడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
ఎంపీలు వరుణ్ గాంధీ, మేనకా గాంధీలకు షాకిచ్చింది భారతీయ జనతా పార్టీ.. 80మందితో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీని ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. కమిటీలో ప్రధాని నరేంద్ర మోడీ, ఎల్‌కే అద్వానీ, డాక్టర్ మురళీమనోహర్ జోషీ, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు నేతలకు చోటు దక్కింది. ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ, తెలంగాణ నుంచి కేంద్రమంత్రి…