తీరం దాటిన మాండూస్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.. ఇక, తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలపై విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ఆయా జిల్లాల కలెక్టర్లు శనివారం, ఆదివారం రెండు రోజులు గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు. వర్షపు నీరు తొలగిన తర్వాత నష్టం అంచనాకు ఎన్యుమరేషన్ ప్రక్రియను చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు…
మాండూస్ తుఫాన్ తీరం దాటింది.. రాత్రి 1:30 గంటల ప్రాంతంలో పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్ తీరం దాటిందని ఐఎండీ ప్రకటించింది… సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఉంది. ఇది కోస్తా తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షపాతాన్ని ప్రభావితం చేసింది. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వాగులు, వంకలు, చెరువులు నిండడంతో.. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి… బాధితులకు అండగా ఉండేందుకు ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో…