అనేక ట్విస్టుల నడుమ నందిగామ మున్సిపల్ చైర్మన్ గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు.. నిన్నే చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ అభ్యర్థి విషయంలో ఎమ్మెల్యే సౌమ్య, ఎంపీ కేసినేని చిన్ని మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇవాళ ఎన్నిక జరిగింది.. ఎంపీ, ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థి కాకుండా మూడో వ్యక్తిగా మండవ కృష్ణకుమారి పేరును అధిష్టానం సూచించడంతో ఆమెను కౌన్సిలర్లు చైర్మన్‌గా ఎన్నుకున్నారు.