యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సామాజిక న్యాయ సూత్రానికి కాంగ్రెస్ వ్యతిరేకమని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో వర్గీకరణ జరుగుతుందని ఎదురు చూసామని తెలిపారు.
Manda Krishna Madiga: నవంబర్ 30 లోపు sc వర్గీకరణ విషయం తేల్చాలని.. సమస్య పరిష్కారానికి ఎవ్వరూ చొరవ తీసుకుంటారో వారికి మద్దతు ఉంటుందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడ మంద కృష్ణ మాదిగ అన్నారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ స్థాయి మాదిగల అస్తిత్వం ఆత్మగౌరవం సదస్సులో ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు రాజయ్య ఉపముఖ్యమంత్రి పదవి పోవడానికి, ఈనాడు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి కడియం శ్రీహరి కారణం అంటూ ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పై అభిప్రాయాలను తీసుకోవడానికి గాంధీభవన్ కు మంద కృష్ణ మాదిగ బృందం వెళ్లింది. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో పాటు పలువురు పార్టీ నేతలతో మంద కృష్ణ సమావేశం అయ్యారు. ఎస్సీలలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ నాయకులకు ఆయన వినతిపత్రాలు ఇచ్చారు.
ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అమలు చేయాలని సుప్రీంకోర్టులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పిటిషన్ దాఖలు చేయగా.. నేడు న్యాయస్థానం విచారణ చేపట్టింది.
సీఎం కేసీఆర్ రాజ్యాంగం పై చేసిన వ్యాఖ్యలు చాలా విరుద్ధమని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారానే కేసీఆర్ సీఎం అయ్యాడని, దళితుల, బీసీల, మైనారిటీల సంక్షేమం కోసం మార్చాలి అంటున్నారని, కానీ రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 9 న సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తామని, సీఎం చేసిన వ్యాఖ్యలు గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. ఏప్రిల్ 9న నిరసనకు అనుమతి…