మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.. తన కుమారుడు మంచు మనోజ్.. ఎంబీయూకు వస్తారన్న సమాచారంతో పోలీసులను ఆశ్రయించారు మోహన్‌బాబు.. మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు మనోజ్ రాకూడదంటూ కోర్టు ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో.. పోలీసులకు ఆ కోర్టు ఉత్తర్తుల గురించి సమాచారం ఇచ్చారు మోహన్ బాబు..
ఇప్పటికే రేణుగుంట ఎయిర్‌పోర్ట్ చేరుకున్న మనోజ్.. మొదట తిరుపతిలోని బంధువుల నివాసానికి వెళ్లనున్నారు.. ఇక, మధ్యాహ్నం 12 గంటలకు శ్రీనివాస మంగాపురం చేరుకొని అక్కడి నుండి ర్యాలీగా.. మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) క్యాంపస్‌కి బయల్దేరి.. 12:30కి MBUకి చేరుకోనున్నారు.. అక్కడి నుంచి 12:50కి నారావారిపల్లెను సందర్శించనున్నారు.. ఇక, మధ్యాహ్నం 1:30 గంటలకు జల్లికట్టు కార్యక్రమానికి హాజరై.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడబోతున్నారు..
Manchu Vishnu: టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి తన గొప్పతన్నాని చాటుకున్నాడు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆయన ఓ మంచి పనికి శ్రీకారం చుట్టాడు. తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద ఉన్న మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నారు. దింతో ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచాడు. జనవరి 13న మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబుతో కలిసి విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనాథ…
మంచు ఫ్యామిలీ తీరు రోజు రోజుకి వివాదాస్పదంగా మారుతుంది. ఇటీవల మంచు విష్ణు, మనోజ్ జల్ పల్లిలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఒకరిపై ఒకరు కేసులు వరకు వెళ్ళింది ఈ వ్యవహారం. అటు మోహన్ బాబు ఓ జర్నలిస్ట్ పై దాడి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. మరోసారి మంచు బ్రదర్స్ ఏదైనా హంగామా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన పోలీసులు ఆదేశాలను మంచు విష్ణు…
మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ మొదలైంది. పహడీషరీఫ్ పోలీసులకు మంచు విష్ణుపై మరోసారి మనోజ్ ఫిర్యాదు చేశాడు. మంచు విష్ణుతో పాటు మరో ఆరుగురిపై మనోజ్ ఫిర్యాదు చేశాడు. విష్ణు అనుచరులు వినయ్ మహేశ్వరి, విజయ్ రెడ్డి, కిరణ్, రాజ్ కొండూరు, శివ, వన్నూరులపై కూడా ఫిర్యాదు చేశాడు.
మంచు కుటుంబంలో మళ్లీ మొదలైంది. పహడీషరీఫ్ పోలీసులకు మంచు విష్ణుపై మరోసారి మనోజ్ ఫిర్యాదు చేశాడు. వినయ్ అనే వ్యక్తిపై కూడా ఫిర్యాదులో మనోజ్ ఫిర్యాదు చేశారు. ఏడు అంశాలపై విష్ణుపై ఏడు పేజీల ఫిర్యాదును మనోజ్ పోలీసులకు పంపించాడు.
మంచు మనోజ్ ఇంట్లోని జనరేటర్ లో మంచు విష్ణు చక్కెర పోసాడని ఆరోపిస్తూ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసాడు మంచు మనోజ్. అయితే మంచు మంచు మనోజ్ ఫిర్యాదు నేపథ్యంలో అయన తల్లి మంచు నిర్మల పహాడీ షరీఫ్ పోలీసులకు వివరణ ఇస్తూ తాజగా లేఖ విడుదల చేసారు. ఆ లేఖలో నిర్మల ” డిసెంబరు 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు అయినవిష్ణు మంచు జల్పల్లి ఇంటికి…
మంచు కుటుంబ కథా చిత్రానికి ఇంకా శుభం కార్డు పడ్డట్టు కనిపించడం లేదు. ముందుగా మోహన్ బాబు ఆయన కుమారుడు నటుడు మనోజ్ మధ్య జరిగిన వివాదం కారణంగా ఇరువురు పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు కంప్లైంట్ లు ఇచ్చుకున్నారు. మొదట దెబ్బలు తగిలాయని మనోజ్ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా ఆ తరువాత మోహన్ బాబు ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. మోహన్ బాబు మీడియా ప్రతినిధి మీద దాడి చేయడం, ఆ తర్వాత మంచు…
సినీ హీరో మంచు విష్ణుకు రాచకొండ సీపీ సుధీర్ బాబు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నేరేడు మెట్ లోని రాచకొండ సీపీ కార్యాలయానికి మంచు విష్ణు వెళ్లారు. స్వతహాగా తన ఎదుట విచారణ హాజరు కావాలని రాచకొండ సిపి నోటీసు ఇవ్వడంతో ఆయన అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో మరోసారి గొడవలు జరిగితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారని సమాచారం. నాలుగు రోజులుగా కుటుంబంలో నెలకొన్న వివాదంపై సీపీ విష్ణు వద్ద ఆరా తీశారు. జల్పల్లి నివాసం…
విద్య నికేతన్ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ మహేశ్వరి వైఖరి వల్లే తమ ఇంట్లో వివాదాలు పెరుగుతున్నాయని సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు. నాన్న (మోహన్ బాబు) గారికి అన్ని విషయాలు తెలియదని, వినయ్ గురించి ఆయనకు చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. మా అమ్మ ఆసుపత్రిలో లేరని, ఇంట్లోనే ఉన్నారని మనోజ్ తెలిపారు. కూర్చొని సామరస్యంగా సమస్య పరిష్కరించుకునేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. తిరుపతి గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలని నాన్న స్కూల్‌ను అక్కడ…