మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఈ రోజు పోలింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.. ముందుకు నిర్ణయించిన ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటలకే ఓటింగ్ ముగియాల్సి ఉన్నా.. మరికొంతమంది ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉండడం మరో గంటపాటు పోలింగ్ సమయాన్ని పొడిగించారు. దాంతో ఈ ఎన్నికలో రికార్డు స్థాయిలో 665 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ ఎన్నికలో రెండు ప్యానళ్ల సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఇక పోలింగ్ జరుగుతున్న సమయంలో వీరి…
గత కొన్ని రోజుల నుంచి చర్చనీయాంశంగా మారిన ‘మా’ ఎన్నికలు ఎట్టకేలకు ఈరోజు ముగిశాయి. 83 శాతం ఓటింగ్ తో ఈసారి ‘మా’ ఎన్నికలు చరిత్ర సృష్టించాయి. ఉదయం నుంచి రెండు ప్యానళ్ల సభ్యుల మధ్య గొడవలు, తోపులాటలు, వాదోపవాదాలు లాంటి సంఘటలు జరిగాయి. ఒకరిపై ఒకరు అరుచుకోవడం, ఘర్షణకు దిగడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో సినిమా ఇండస్ట్రీ రెండుగా చీలిందా ? అనే అనుమానం రాక మానదు ఎవరికైనా. ముఖ్యంగా మంచు విష్ణు,…
క్షణక్షణం ఉత్కంఠను రేపుతూ రణరంగాన్ని తలపించిన ‘మా’ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. ఇంతకు మునుపెన్నడూ జరగని విధంగా ఈసారి చాలామంది ‘మా’ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ‘మా’ సభ్యులు 925 మంది ఉండగా, రికార్డు స్థాయిలో అంటే పోస్టల్ బ్యాలెట్ తో కలిఫై మొత్తం 665 మంది సభ్యులు ఓటు వేశారు. దాదాపు 60 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 83 శాతం ఓటింగ్ నమోదయ్యింది. గతంతో పోలిస్తే భారీగా…
‘మా’ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. నటీనటులంతా తమ ఓట్లను వినియోగించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ‘మా’ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లరి నరేష్ తమ ఓట్లను వేశారు. అయితే అందరికీ షాకిస్తూ జెనీలియా కూడా ‘మా’లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చింది. “మా” ఎన్నికలు జరుగుతున్న స్థలానికి వచ్చిన జెనీలియా మంచు విష్ణుతో కలిసి కన్పించింది. వారిద్దరూ…
కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా.. బెట్టింగ్ రాజాలు కూడా అదే పంథాను ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు కోళ్లపై, గుర్రాలపై పందేలు కాసేవాళ్లు. ఆ తర్వాత రాజకీయాలు, క్రికెట్ వంటి క్రేజీ అంశాలపై బెట్టింగులు నిర్వహిస్తూ పందెంరాయుళ్లు కోట్లలో సంపాదించడం మొదలుపెట్టారు. అయితే ట్రెండ్ మారుతున్న కొద్ది బెట్టింగ్ రాజాలు సైతం అప్ డేట్ అవుతున్నారు. మీడియాలో ఏ అంశంపై ప్రజలు విపరీతంగా చర్చిస్తూ ఉంటారో అలాంటి అంశాలనే పందెంరాయుళ్లు దృష్టిసారిస్తున్నారు. వాటిపైనే లక్షల్లో పందేలు కాస్తూ జేబులు…
మా ఎన్నికలు సినీ పరిశ్రమలో కాకరేపుతున్నాయి.. ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్ల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. అయితే, తాజాగా మా ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మెగా బ్రదర్ నాగబాబు.. దేశ ప్రధానితో పోరాటం తెలిసిన వ్యక్తి ప్రకాశ్ రాజ్ అని.. ప్రకాశ్ రాజ్ కు ఉన్న ప్రత్యేకతలు విష్ణులో లేవన్నారు.. ప్రకాశ్ రాజ్ తో పోల్చాలంటే మోహన్ బాబును పోల్చాలని సూచించిన ఆయన.. విద్యార్థులకు ఏం కావాలో విద్యాసంస్థ నడుపుతున్న మోహన్ బాబుకు తెలుసు,…
‘మా’ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడింది. అటు ప్రకాశ్ రాజ్, ఇటు విష్ణు పానెల్స్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. రెండు ప్యానల్స్ కి మద్దతుగా గళం విప్పుతున్నవారు ఉన్నారు. తాజాగా తన కుమారుడు మంచు విష్ణుకి ఓటు వేయాలని అభ్యర్ధిస్తూ మోహన్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు. తన క్రమశిక్షణకు, కమిట్ మెంట్ కి విష్ణు వారసుడని చెబుతూ తను ఇక్కడే ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా పక్కన నిలబడతాడనే హామీని ఇస్తున్నానని,…