మంచు వారి అబ్బాయి విష్ణువర్ధన్ బాబు తండ్రి మోహన్ బాబు లాగే కంచు కంఠం వినిపిస్తూ ఉంటారు. సినిమాల్లో దాదాపుగా తండ్రిని అనుకరిస్తూ నటించే మంచు విష్ణు, మొన్న జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల్లోనూ తనదైన బాణీ పలికించారు. అందరినీ కలుపుకుపోతూ ‘మూవీ ఆర్టిస్ట్స్ మంతా ఒక ఫ్యామిలీ’ అనే నినాదంతో ‘మా’ అధ్యక్షునిగా ఘనవిజయం సాధించిన మంచు విష్ణు ఆ మధ్య ప్రతి రోజూ వార్తల్లో నిలిచారు. హీరోగా అనేక చిత్రాలలో నటించినా, మంచు…