విలక్షణ నటుడు డాక్టర్ మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవ జరిగింది అంటూ జనం కోడై కూస్తున్నారు. కానీ, మనోజ్ విడుదల చేసిన వీడియోలోనూ వారిద్దరూ ఎక్కడా గొడవపడినట్టు లేదు. కేవలం వాయిస్ ఓవర్ లో వినిపించిన మంచు మనోజ్ వాయిస్ లో “ఇది సిట్యువేషన్… ఇది ఇళ్ళల్లోకి వచ్చి కొడుతూంటాడండి…మావాళ్ళని బందువులని…” అని వినిపించడం ఓ కారణం కాగా, “వాడేదో అన్నాడు కదా… ఒరేయ్ గిరేయ్…అని…”అంటూ మంచు విష్ణు అనడం…