“మనం సైతం” ఉచిత ఆంబులెన్స్ సేవలు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో సాగుతున్న “మనం సైతం” సేవా సంస్థ మరో మైలురాయి దక్కించుకుంది. సొంత ఆంబులెన్స్ కలిగిన సేవా సంస్థగా ముందడుగు వేసింది. ఈ ఉచిత ఆంబులెన్స్ సేవల ప్రారంభ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింనగర్ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీబీఐ మాజీ డీజీ లక్ష్మీ నారాయణ, నిర్మాతలు సి కళ్యాణ్, దర్శకుడు వివి వినాయక్, కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు, నటి సన తదితరులు పాల్గొన్నారు. కాదంబరి కిరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అతిథులు ప్రశంసించారు. తమ సేవా కార్యక్రమాల్లో ఉచిత ఆంబులెన్స్ సేవలు ప్రారంభించడం ఒక గొప్ప ముందడుగు అని సంస్థ ఫౌండర్ కాదంబరి కిరణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Read Also : “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్”… ఫ్యాన్స్ కు పండగే ఇక !
Also Read
ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ…చిన్నతనం నుంచి సేవ చేయడం అంటే తెలియని ఇష్టం ఉండేది. నేనే రంగంలో ఉన్నా నాలో సేవాగుణం పెరుగుతూ వచ్చింది. పేదలకు చేతనైన సాయం చేయాలనే మనం సైతం సంస్థను ప్రారంభించాం. ఇవాళ ఆ సంస్థ వేలాది మందికి చేరువైంది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లో ఎంతోమందికి సహాయ కార్యక్రమాలు చేశాం. మా సంస్థకు సొంత ఆంబులెన్స్ సమకూర్చుకున్నాం. ఈ ఆంబులెన్స్ సేవలు పూర్తిగా ఉచితంగా అందిస్తాం. ఈ కార్యక్రమానికి సినిమా పరిశ్రమతో పాటు వివిధ రంగాల పెద్దలు వచ్చి ఆశీర్వదించడం ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోంది. భవిష్యత్ లో ‘సపర్య’ పేరుతో వృద్ధాశ్రమం స్థాపించాలి, అక్కడ నిరాదరణకు గురైన వారికి ఆశ్రయం కల్పించాలి అనేది నా కల. అన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!