ప్రస్తుతం హిమల్‌చల్ ప్రదేశ్ పర్యాటకులతో కిటకిటలాడుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో దేశ నలుమూలల నుంచి పర్యాటకులు పోటేత్తున్నారు. భారీ సంఖ్యలు పర్యాటకులు రావడంతో మనాలి, అటల్ టన్నెల్ వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. కిలోమీటర్ల మేర వాహనాలు వరుస కట్టిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పొగమంచు, వేల సంఖ్యలో పర్యాటకుల రాకతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ సుమారుగా 5 గంటల పాటు వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.…