వనపర్తి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా వేదికగా మన ఊరు – మన బడి కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మన ఊరు – మన బడి పైలాన్‌ను సీఎం కేసీఆర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కలిసి ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. మన ఊరు మనబడి కార్యక్రమం రాష్ట్రంలోని విద్యారంగాన్ని పటిష్టం చేయనుందని కేసీఆర్ తెలిపారు.…