Mamta Kulkarni: బాలీవుడ్ మాజీ నటి, ప్రస్తుతం సన్యాసినిగా జీవిస్తున్న మమతా కులకర్ణి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గోరఖ్‌పూర్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో మరోసారి వివాదం చెలరేగింది. తన మూడు రోజుల ఆధ్యాత్మిక పర్యటన సందర్భంగా విలేకరుల సమావేశంలో మమతా మాట్లాడుతూ.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముంబై పేలుళ్లకు పాల్పడలేదని, అతడు ఉగ్రవాది కాదన్నారు.
Mamta Kulkarni: బాలీవుడ్ ఒకప్పటి అందాల నటి మమతా కులకర్ణి ఇటీవల సన్యాసిగా మారి వార్తల్లో నిలిచారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఆమె సన్యాసిగా మారారు. అయితే, ఆమె తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. కిన్నార్ అఖాడా మహామండలేశ్వర్ పదవికి రాజీనామా చేస్తు్నట్లు అధికారికంగా ప్రకటించారు. సాధ్విగా తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తానని చెప్పారు.
ఇప్పుడు ఈ మహామండలేశ్వర్‌గా నియమించడం వివాదాస్పదమైంది. తాజాగా కిన్నార్ అఖాడా నుంచి మమతా కులకర్ణితో బహిష్కరించారు. ఆమెతో పాటు లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిని కూడా బహిష్కరించారు. కిన్నార్ అఖాడా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ వీరిద్దరి నుంచి అఖాడా నుంచి బహిష్కరించినట్లు తెలిసింది. మమతా కులకర్ణిని మహామండలేశ్వర్‌గా నియమించడం వివాదాస్పదం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మమతా కులకర్ణి.. ఒకనాడు బాలీవుడ్‌ను షేక్ చేసిన హీరోయిన్. భారతీయ చలనచిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బెంగాలీ, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.
బాలీవుడ్ కి, డ్రగ్స్ కి ఉండే సంబంధం ఈనాటిది కాదు. సంజయ్ దత్ మొదలు చాలా మంది బడా సెలబ్రిటీలు డ్రగ్స్ సేవించిన వారే. అయితే, డ్రగ్స్ తీసుకోవాలంటే తెచ్చే వారు కూడా ఉండాలి కదా? అలా డ్రగ్స్ సరఫరాలో కాంట్రవర్సీలు, కేసుల పాలైన బీ-టౌన్ బ్యూటీస్ కూడా ఉన్నారు. ఈ మధ్యే రియా చక్రవర్తి మత్తు పదార్థాల ఆరోపణలతో జైలుకి వెళ్లొచ్చింది. అయితే, ఆమె కంటే ముందే 2016లో డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది మమతా కులకర్ణి.…