(సెప్టెంబర్ 7న మమ్ముట్టికి 70 ఏళ్ళు పూర్తి) మళయాళ చిత్రసీమలో ప్రేమ్ నజీర్ తరువాత సూపర్ స్టార్ స్థానం ఖాళీ అయింది. ఆ సమయంలో ప్రేమనజీర్ తరం వారు భలేగా పోటీపడ్డారు. కానీ, వారి తరువాత వచ్చిన మమ్ముట్టి ఆ స్థానం ఆక్రమించారు. తనదైన అభినయంతో మమ్ముట్టి అనేక మళయాళ చిత్రాలను విజయతీరాలకు చేర్చారు. తక్కువ పెట్టుబడితోనే చూపరులను కట్టిపడేసేలా చిత్రీకరించడంలో మళయాళ దర్శకులు ఆరితేరినవారు అని ప్రతీతి. మమ్ముట్టి చిత్రాలను మన బడ్జెట్ తో పోల్చి…