వరుస పరాజయాలతో సాగుతున్న సుమంత్ ‘మళ్ళీ రావా’ మూవీతో మళ్ళీ కాస్తంత లైమ్ లైట్ లోకి వచ్చాడు. బాహుశా ఆ సెంటిమెంట్ తోనే కావచ్చు అతని లేటెస్ట్ మూవీకి ‘మళ్ళీ మొదలైంది’ అనే టైటిల్ పెట్టారు. సుమంత్, వర్షిణి సౌందర్ రాజన్, నైనా గంగూలి ప్రధాన పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ శుక్రవారం నుండి జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. హీరో మసాలా అధినేత్రి సుజాత (సుహాసిని) సింగిల్ మదర్. ఆమె తల్లి శారద…