కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్ లేలాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్‌ను ప్రారంభించారు మంత్రి నారా లోకేష్.. దీంతో, అమరావతిలో తొలి ఆటోమొబైల్ ప్లాంట్‌గా నిలిచింది అశోక్ లేలాండ్.. ఈ యూనిట్‌లో ఎలక్ట్రిక్, డీజిల్ బస్సుల బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది హిందూజా గ్రూప్.. ఈ ప్లాంట్ ఏడాదికి 2,400 బస్సుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది..
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అనంతరం వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మల్లవల్లి రైతుల్లో ప్రతి ఒక్కరికీ పరిహారం అందేవరకు జనసేన అండగా ఉండి పోరాటం చేస్తుందని తెలిపారు.