నేను సెల్ ఫోన్ గోనసంచిలో మడిచి వెనక పడేసాను అని చెప్పారు. నేనొక మినిస్టర్ నా కంత అవసరం లేదు అంటూ తెలిపారు. నాకు రైడ్స్ ఏమీ కొత్తకాదు. నాకు మూడో సారి రైడ్ జరగడం అన్నారు. ఆరేడ్ కూడా హాట్రిక్ రేడ్ అంటూ మల్లారెడ్డి తెలిపారు.
వామ్మో.. ఈ ఐటీ దాడులు తెలంగాణలో ఒక చరిత్ర అని మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. రెండు సార్లు ఐటి దాడులు జరిగినప్పుడు నేను డబ్బులు కట్టినా మరి మూడో సారి ఇలా హడావుడి ఎందుకు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం ఘట్‌కేసర్‌లో నిర్వహించిన రెడ్ల సింహగర్జన బహిరంగ సభలో మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై జరిగిన దాడిపై స్పందిస్తూ.. ఆయనకు తగిన శాస్తే జరిగిందని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అడ్డదిడ్డంగా మాట్లాడినందుకే ప్రజలు వ్యతిరేక నినాదాలు చేశారని, ఆయన కాన్వాయ్‌పై దాడి చేశారని అన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల భూముల్ని రాజ్యాంగబద్దంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ల్యాండ్ పూలింగ్ జీవో ఎందుకు రద్దు చేయడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్…
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లో నిర్వహించిన రెడ్ల సింహగర్జన బహిరంగ సభలో మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే! తొలుత ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొందరు వ్యతిరేక నినాదాలతో గందరగోళం సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా ఉందని, సీఎం కేసీఆర్ అనేక పథకాల్ని అమలు చేస్తున్నారని మల్లారెడ్డి ప్రశంసలు కురిపిస్తున్న తరుణంలో సభికుల నుంచి ఒక్కసారిగా వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. దీంతో ఆయన తన ప్రసంగం ముగించుకొని కాన్వాయ్‌లో వెళుతుండగా.. నిరసనకారులు కుర్చీలు,…
సొంత జిల్లాలో మంత్రి ఒంటరయ్యారా? పార్టీ సీరియస్‌గా ఫైట్ చేస్తున్న అంశంలో మంత్రితో జిల్లాలోని అధికారపార్టీ ఎమ్మెల్యేలు కలిసి రాలేదా? ఏక్ నిరంజన్‌గానే కార్యక్రమం నడిపించేశారా? జిల్లాలో గ్రూపుల గోలపై పార్టీ వర్గాలకు క్లారిటీ వచ్చేసిందా? ఇంతకీ ఎవరా మంత్రి? జిల్లాలో మంత్రితో కలిసిరాని ఎమ్మెల్యేలు మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఎవరికి వారుగా విడిపోయి గ్రూపులు కట్టారు. ఎప్పట్నుంచో జిల్లాలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి కార్యక్రమం నిర్వహించే పరిస్థితి…
మల్లారెడ్డి యూనివర్శిటీ మరియు మోటివిటి ల్యాబ్స్ సహకారంతో టెక్నో ఇన్నోవేషన్ కేంద్రాన్ని మల్లారెడ్డి యూనివర్శిటీ వ్యవస్థాపక చైర్మన్ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు ఉన్నత విద్య తో పాటు ఉపాది అవకాశాలుతో పాటు విద్యార్థులు చదువుకొంటూనే ఉద్యోగ అవకాశాలు, సాంకేతిక పరమైన ఆలోచనలు పరస్పరం పంచుకోవడం, ఇంటర్న్ పిప్ ల ద్వారా పరిశ్రమల వాతావరణం అనుకూలంగా ఉంటేట్లు ఏర్పాటు చేస్తూ వారికి శిక్షణ అందిస్తామని ,,ఇన్నోవేషన్ & స్టార్ట్ అప్ లను ప్రోత్సహిస్తూ వారి ఆలోచనలకు వాణిజ్యీకరణ…
టీఆర్ఎస్ ప్లీనరీ కేడర్‌లో జోష్ తీసుకొస్తే.. కొన్ని జిల్లాల్లో అసంతృప్త జ్వాలలను రాజేసింది. ఆహ్వానాల విషయంలో వివక్ష చూపించారని మంత్రిపై చింతనిప్పులు తొక్కుతున్నారు నేతలు. ఎవరా మంత్రి? ఏంటా జిల్లా? ప్లీనరీ పాస్‌లపై మేడ్చల్ టీఆర్ఎస్‌లో రగడ..! టీఆర్ఎస్ ప్లీనరీకి మేడ్చల్ జిల్లా నుంచి 200 మంది ముఖ్యనేతలకు పాసులు జారీ చేశారు తెలంగాణ భవన్ సిబ్బంది. జిల్లాలో పీర్జాదిగుడా, బోడుప్పల్, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ప్లీనరీకి వార్డు కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు కూడా పాసులు…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఊరు ఊరికో జమ్మి చెట్టు..గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా నేడు కీసర రామ లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కీసర రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అదేవిధంగా తను దత్తత తీసుకున్న కీసర ఫారెస్ట్ పెద్ద చెరువు దగ్గర జమ్మి చెట్లను మంత్రి మల్లారెడ్డితో కలిసి నాటారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… రాజ్యసభ సభ్యులు…