తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది… మంత్రి మల్లారెడ్డి విసిరిన సవాల్‌కు స్పందిస్తూ.. మల్లారెడ్డికి కాదు.. సీఎం కేసీఆర్‌కే నా సవాల్.. అసెంబ్లీ రద్దు చేసి రావాలి ఎన్నికలకు వెళ్దామని ప్రకటించాడు రేవంత్‌రెడ్డి.. ఇక, అంతేకాదు.. మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ.. కొన్ని పత్రాలను కూడా మీడియాకు చూపించారు.. అయితే, తాజాగా రేవంత్‌రెడ్డికి కౌంటర్ ఇస్తూనే.. ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి మల్లారెడ్డి.. తాను ఎంపీ…
ఆడవారి మాటలకు అర్థాలే వేరన్నట్టు.. రాజకీయ నేతల మాటలకు అర్ధాలు వేరు. స్టేట్‌మెంట్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. మంత్రి మల్లారెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ మధ్య సవాళ్లూ ఆ కోవలోకే చేరతాయా? రాజీనామాలపై వారి ప్రకటనలు నమ్మొచ్చా.. లేక రాజీడ్రామాలా? ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ట్రెండింగ్ సీన్ ఇదే. అసలే మంత్రి మల్లారెడ్డి. పక్కా నాటు. ఆయన్ని కెలికారు పీసీసీ చీఫ్ రేవంత్. ఇంకేముందీ మీడియా ముందుకు వచ్చి తొడలు కొట్టారు.. సవాళ్లు విసిరారు మంత్రిగారు. రాజీనామాలపై…
దళిత గిరిజన బిసీ మైనార్టీ లకు లాభం జరగాలనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. రాజకీయంగా నష్టం జరిగినా సోనియా తెలంగాణ ఇచ్చారు. అందుకే రేవంత్ రెడ్డి సోనియాను తెలంగాణ తల్లి అంటున్నారు అని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ దళిత గిరిజనులకు అణచి వెస్తున్నారు. అర్హులైన దళిత గిరిజన అధికారులను ప్రధాన్యత కలిగిన పోస్ట్ లను ఇస్తున్నారు. అగ్రవర్ణాల అధికారులు రిటైర్డ్ అయ్యాక కూడా తిరిగి పోస్ట్ లలో…
తెలంగాణలో మరోసారి సవాల్ పర్వం తెరపైకి వచ్చింది… మంత్రి మల్లారెడ్డి అనుమతి తెచ్చుకున్న యూనివర్సిటీ స్థలం సైతం కబ్జా చేసిందేనంటూ.. తప్పుడు పత్రాలు చూపించి అనుమతి పొందారంటూ ఆరోపించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఈ వ్యవహారంపై దమ్ముంటే విచారణ జరిపించాలంటూ సీఎం కేసీఆర్‌కు సవాల్ చేశారు. ఇక, దీనిపై మంత్రి మల్లారెడ్డికి చిర్రెత్తుకొచ్చింది.. ఆ వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి.. రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి మల్లాడిరెడ్డి.. పీసీసీ చీఫ్‌పై ఏకవచన వ్యాఖ్యలతో విరిచుకుపడ్డ మల్లారెడ్డి.. రాజీనామా చేద్దాం..…
ఆయనో మంత్రి. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా సొంత పార్టీవర్గాలే చెవులు కొరుక్కుంటాయి. ఏదో ఒక అంశంలో మంత్రి పేరు వినిపించడం కామన్. ఈసారి తమ్ముడు చేసిన పనివల్ల చిక్కుల్లో పడ్డారు. విపక్షాలకు మళ్లీ దొరికిపోయారు. దాంతో ఆ సమస్య నుంచి బయటపడేందుకు దారులు వెతుక్కుంటున్నారట అమాత్యుల వారు. మళ్లీ చర్చల్లోకి వచ్చిన మంత్రి మల్లారెడ్డి మంత్రి చామకూర మల్లారెడ్డి. ఈ పేరు చెప్పగానే రాజకీయవర్గాల్లో అనుకోకుండానే నవ్వు వచ్చేస్తుంది. ఆయన కామెడీ టైమింగ్ అలా ఉంటుంది మరి.…
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఈటల రాజేందర్ విషయం హల చల్ గా మారింది. తెరాస పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక రేపు ఢిల్లీ వెళ్లనున్న ఈటల అక్కడ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. అయితే మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ ను మోసం చేసిన వ్యక్తిగా ఈటల నిలిచి పోతారు అని తెలిపారు. తెలంగాణ ప్రజల…