మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం ఎందుకు హాట్ సీటైంది? అన్ని ప్రధాన పార్టీలు అక్కడే ఎందుకు ఫోకస్ చేస్తున్నాయి? అదే నియోజకవర్గం కేంద్రంగా సీఎం రేవంత్‌ని టార్గెట్ చేసుకుని కేటీఆర్ మాటల తూటాలు పేల్చడానికి కారణాలేంటి? అన్ని పార్టీల్లో మల్కాజ్‌గిరి మల్లగుల్లాలకు కారణాలేంటి? లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం ప్రత్యేకమే అయినా… తెలంగాణలోని ఆ ఒక్కటి మాత్రం హాట్ సీటుగా మారిపోయింది. అన్ని పార్టీల్లో దాని కోసం విపరీతమైన పోటీ ఉంది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరిలో…