పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంపి మహువా మోయిత్రాకు ముఖ్యమైన బాధ్యతలను అప్పగించారు. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ (నాడియా నార్త్) అధ్యక్షురాలిగా మొయిత్రాను టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ నియమించారు.
Parliament Winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 4 నుంచి 22 వరకు 15 సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం తెలిపారు. ఈ విషయాన్ని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. సమావేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘క్యాష్ ఫర్ క్వేరీ’ ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ నివేదికను లోక్‌సభ సెషన్‌లో ప్రవేశపెట్టనున్నారు. ప్యానెల్ సిఫారసు చేసిన మహువా మోయిత్రా బహిష్కరణ అమలులోకి రాకముందే సభ నివేదికను ఆమోదించాల్సి…
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా అంశం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ ఆమెపై విచారణ జరిపింది. అంతకుముందు మహువా మోయిత్రాపై ఆరోపణలు గుప్పించిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేను కూడా విచారించింది.
Mahua Moitra: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి లంచం తీసుకుందనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా. ‘క్యాష్ ఫర్ క్వేరీ’గా పిలువబడుతున్న ఈ కేసులో పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ ఇప్పటికే ఆమెను విచారించింది. ఈ నేపథ్యంలో ఎథిక్స్ ప్యానెల్ డ్రాఫ్ట్ నివేదిక తయారైంది. ఇందులో ఆమెపై ‘కఠిన శిక్ష’ విధించాలని సూచించిందని, ఆమెను లోక్‌సభ నుంచి తక్షణమే బహిష్కరించాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
Mahua Moitra: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా డబ్బులు తీసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఆమెను పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ విచారించింది. ఇదిలా ఉంటే మహువా మోయిత్రాపై సీబీఐ విచారణ చేయాలని యాంటీ-కరప్షన్ ప్యానెల్ ఆదేశించిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mahua Moitra: ‘‘క్యాష్ ఫర్ క్వేరీ’’ కేసులో టీఎంసీ మహువా మోయిత్రా ఈ రోజు పార్లమెంటరీ ఎథిక్స్ ప్యానెల్ ముందు హాజరయ్యారు. అయితే ఈ సమావేశం రసాభాసగా మారినట్లు తెలుస్తోంది. మోయిత్రాకు అండగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మద్దతు తెలిపారు. ప్యానెల్ తప్పుడు ప్రశ్నలు అడుగుతోందని ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో పాటు మహువా మోయిత్రా సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
Mahua Moitra: ‘క్యాష్ ఫర్ క్వేరీ’ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా నేడు పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యారు. పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ఆమె డబ్బులు, గిఫ్టులు తీసుకున్నట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించించారు. అంతే కాకుండా ఆమెకు సంబంధించిన పార్లమెంట్ లాగిన్ ఐడీ వివరాలను ఇతరులతో పంచుకున్నారని, దుబాయ్ వేదికగా పలుమార్లు లాగిన్ అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ ఎథిక్స్…
Mahua Moitra: ‘‘ క్యాష్ ఫర్ క్వేరీ ’’ కేసులో మహువా మోయిత్రాపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీని విమర్శించేందుకు అదానీ వ్యవహారాన్ని అస్త్రంగా ఉపయోగించుకున్నారని, పార్లమెంట్‌లో అదానీపై ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకుందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. అయితే ఈ కేసులో పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి ఇప్పటికే హీరానందానీ అఫిడవిట్ సమర్పించారు. మహువా తన దగ్గర నుంచి గిఫ్టులు తీసుకున్నారని తెలిపారు.
Mahua Moitra: క్యాష్ ఫర్ క్వేరీ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా రేపు పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ముందు హాజరుకాబోతున్నారు. పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ముడుపులు తీసుకున్నారనే అభియోగాలు ఆమెపై ఉన్నారు. వీటిపై ఇప్పటికే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్ సభ స్పీకర్ కి లేఖ రాశారు. ఆమె ఇండియాలో ఉన్న సమయంలో దుబాయ్ నుంచి ఆమె పార్లమెంట్ ఐడీ లాగిన్ అయిందని ఆరోపిస్తూ ఐటీ…