Mahindra XUV 3XO: దేశీయ ఆటో మేకర్ మహీంద్రా కార్లు కొనాలంటే సంవత్సరాలు ఆగాల్సిందే అనే భయం కస్టమర్లలో ఉంది. మహీంద్రా కార్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ‘‘వెయిటింగ్ పీరియడ్’’ ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇప్పుడు మహీంద్రా XUV 3XO కొనే వారికి గుడ్ న్యూస్, ఈ ఎస్‌యూవీ కోసం వేచి చూసే సమయం తగ్గింది. XUV 3XO 2024లో మార్కెట్‌లోకి వచ్చి సూపర్ సక్సెస్ అయింది.